Mynampally Hanumantha Rao : మల్కాజిగిరి నుండి పోటీ చేస్తా
మైనంపల్లి హన్మంతరావు
Mynampally Hanumantha Rao : హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీకి గుడ్ బై చెప్పిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు సంచలన ప్రకటన చేశారు. తాను మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని స్పష్టం చేశారు. మైనంపల్లి మీడియాతో మాట్లాడారు.
Mynampally Hanumantha Rao Comment
తాజాగా బీఆర్ఎస్ పార్టీ చీఫ్ , సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ప్రతిపక్షాలకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో 119 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి 115 సీట్లకు అభ్యర్థులను డిక్లేర్ చేశారు. మిగతా పార్టీలు ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.
ఈ తరుణంలో తనకు మాత్రమే సీటు వచ్చినా తన తనయుడికి సీటు రాలేదని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు(Mynampally Hanumantha Rao). రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును ఏకి పారేశారు.
తన కొడుక్కి సీటు రాకుండా చేశాడంటూ మండిపడ్డారు. పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించాడని ఆరోపించారు. నువ్వు ఎక్కడ పోటీ చేసినా నేను అక్కడ తిష్ట వేస్తానని, హరీశ్ రావును ఓడించి తీరుతానని శపథం చేశారు మైనంపల్లి హన్మంతురావు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : Posani Krishna Murali : పురందేశ్వరిపై పోసాని ఫైర్