Mynampally Hanumantha Rao : మల్లారెడ్డి దోచుకున్నడు
మైనంపల్లి హన్మంతురావు కామెంట్
Mynampally Hanumantha Rao : బీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు. ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. డబ్బులు ఇచ్చినోళ్లకు టికెట్లు ఇస్తున్నారంటూ ఆరోపించారు. కష్టపడి పని చేసే వాళ్లకు ఇక్కడ స్థానం లేదన్నారు. కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.
Mynampally Hanumantha Rao Comments on BRS Party
పార్టీ నుంచి బయటకు వస్తే తనకు మద్దతు ఇస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. అక్రమ కేసులకు భయపడేటోన్ని కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం తాను శాయ శక్తులా కృషి చేశానని, ఎక్కడా వ్యతిరేకంగా వ్యవహరించ లేదని స్పష్టం చేశారు మైనంపల్లి హన్మంతరావు.
కరోనా సమయంలో తన కొడుకు మైనంపల్లి రోహిత్ కు కావాలని టికెట్ ఇవ్వకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఆనాడు చంద్రబాబుకు కష్టపడి చేశానని, ఇవాళ కేసీఆర్ కు కట్టుబడి పని చేశానని తెలిపారు. కానీ ఏరోజూ వ్యతిరేకంగా చేయలేదన్నారు మైనంపల్లి హన్మంతురావు(Mynampally Hanumantha Rao). కార్యకర్తలు రోడ్డు మీద ఉన్నారని, వారిని ఆదుకోవడం తన ముందున్న కర్తవ్యమన్నారు.
కేసీఆర్ మంచోడు అని , కానీ ఎవరి ఒత్తిళ్లకు లొంగనన్నారు. మంత్రి మల్లారెడ్డి మొత్తం దోచుకున్నాడని ఆరోపించారు.
Also Read : Daggubati Purandeswari : బుగ్గనపై పురందేశ్వరి ఫైర్