Mynampally Hanumantha Rao : మైనంపల్లి షాకింగ్ కామెంట్స్
డబ్బులు తీసుకోండి ఓటు నాకేయండి
Mynampally Hanumantha Rao : హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజా సేవ కోసమేనని స్పష్టం చేశారు. తాను ఎవరికీ గులాం గిరీ చేయలేదని స్పష్టం చేశారు. తాను సింహం లాగా ఉన్నానని, తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు.
Mynampally Hanumantha Rao Comments Viral
ఈ సందర్బంగా మైనంపల్లి హనుమంత రావు మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు డబ్బులు పంచుతారని, మదం పంపిణీ చేస్తారని , చీరల పేరుతో ప్రభావం చూపించే ప్రభావం ఉందని తాను వద్దని అనడం లేదన్నారు.
ఈ తరుణంలో డబ్బులు తీసుకుంటే తప్పేమీ లేదని కానీ తనకు మాత్రం ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మైనంపల్లి హనుమంత రావు(Mynampally Hanumantha Rao) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. కాగా ప్రముఖ సర్వే సంస్థ లోక్ పోల్ సంచలన ఫలితాలు వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పింది.
రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకత వ్యక్తం అవుతోందని , మార్పు తథ్యమని స్పష్టం చేసింది.
Also Read : Sachin Tendulkar : ఆ నాలుగు జట్లకు గెలిచే ఛాన్స్