Mynampally Hanumantha Rao : కేటీఆర్ నీ అయ్య జాగీరా

మైనంప‌ల్లి హ‌నుమంత రావు

Mynampally Hanumantha Rao : మెద‌క్ జిల్లా – మ‌ల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్ముంత‌రావు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై , మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు.

ప్ర‌త్యేకించి కేటీఆర్ ను టార్గెట్ చేశారు. తెలంగాణ నీ అయ్య జాగీరా అని నిల‌దీశారు. చంద్ర‌బాబు అరెస్ట్ అయితే ఇక్క‌డ ఆందోళ‌న చేయొద్ద‌ని చెప్ప‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు.

Mynampally Hanumantha Rao Slams KTR

రోజుకు 450 కిలోమీట‌ర్లు తిరిగిన చ‌రిత్ర త‌న‌ద‌న్నారు. ఆనాడు మెద‌క్ జిల్లాలో పార్టీ బ‌లోపేతం కోసం క‌ష్ట‌ప‌డ్డాన‌ని అన్నారు. ఇవాళ పార్టీలో ఉన్న వాళ్ల‌కే ప్ర‌యారిటీ ఇస్తూ వ‌చ్చార‌ని అందుకే తాను బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింద‌న్నారు.

ఎక్క‌డిక‌క్క‌డ ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. అయినా మెద‌క్ జిల్లా త‌న‌ద‌ని , ఎవ‌రు ఎలా గెలుస్తారో తాను చూస్తాన‌ని స‌వాల్ విసిరారు మైనంప‌ల్లి హ‌న్ముంత‌రావు(Mynampally Hanumantha Rao). ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు చేసినా, లేదా ఇంకెన్ని వ్యూహాలు ప‌న్నినా చివ‌ర‌కు గెలిచేది తామేన‌ని ప్ర‌క‌టించారు.

Also Read : Minister KTR Praise : అంజ‌న్న‌ను కొట్టేటోడు లేడు – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!