Mynampally Hanumantha Rao : మల్లారెడ్డి ఓ బ‌ఫూన్

ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు

Mynampally Hanumantha Rao: హైద‌రాబాద్ – మ‌ల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత రావు నిప్పులు చెరిగారు. త‌న‌పై అనుచిత కామెంట్స్ చేసిన మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డిపై మండిప‌డ్డారు. నీది గాడిద మొహం, నువ్వో బ‌ఫూన్ గాడివి అంటూ ఎద్దేవా చేశారు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగారు.

Mynampally Hanumantha Rao Slams Malla Reddy

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌రిగిన స‌భ‌లో మైనంప‌ల్లి హ‌నుమంత రావు ప్ర‌సంగించారు. ఆయ‌న గ‌తంలో టీడీపీలో ఉన్నారు. ఆ త‌ర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకున్నారు.

నిన్న‌టి దాకా సీఎం కేసీఆర్, కేటీఆర్ తో స‌న్నిహిత సంబంధాలు క‌లిగిన మైనంప‌ల్లి(Mynampally Hanumantha Rao) త‌న‌కు ఎన్నిక‌ల్లో రెండు టికెట్లు కావాల‌ని కోరారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పు కోలేదు. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ హ‌రీశ్ రావును టార్గెట్ చేశారు. ఒక‌నాడు స్లిప్ప‌ర్ల‌తో తిరిగిన నీకు ఇన్ని వేల కోట్లు ఎలా వ‌చ్చాయో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ప్ర‌స్తుతం జ‌రిగే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా తాను గెలుస్తాన‌నే ధీమాలో ఉన్నారు మైనంప‌ల్లి. ఎలాగైనా ఆయ‌న‌ను ఓడించాల‌ని బీఆర్ఎస్ కంక‌ణం క‌ట్టుకుంది. మొత్తం మీద మ‌ల్లారెడ్డిపై చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : Aishwarya Rai Comment : వెండి తెర‌పై వాలిన వెన్నెల‌

Leave A Reply

Your Email Id will not be published!