N Raghuveera Reddy : మార్పు ఖాయం కాంగ్రెస్ విజయం
నీలకంఠాపురం రఘువీరా రెడ్డి
N Raghuveera Reddy : ముషీరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో మార్పు ఖాయమని జోష్యం చెప్పారు మాజీ మంత్రి, ఏపీసీసీ చీఫ్ నీలకంఠాపురం రఘువీరా రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ తరపున ప్రచారం చేపట్టారు.
N Raghuveera Reddy Word
రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారాయన్నారు. వ్యవస్థలన్నీ సర్వ నాశనం చేశారంటూ మండిపడ్డారు. నీలకంఠాపురం రఘువీరా రెడ్డి(N Raghuveera Reddy) తో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య తో కలిసి ప్రచారం చేపట్టారు. హామీలు, సంక్షేమ పథకాల పేరుతో జనాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ ను ఇంటి బాట పట్టించేందుకు సిద్దమై ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఉన్నా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయక పోవడం దారుణమని ఆవేదన చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్స్ తప్పా ఎన్ని పోస్టులు భర్తీ చేశారో చెప్పాలన్నారు.
ఇవాళ ప్రజలు పూర్తిగా అవగాహనతో ఉన్నారని, ఏ పార్టీ అయినా సరే ప్రజలను విస్మరిస్తే ఇలాగే అవుతుందన్నారు. 119 నియోజకవర్గాలలో తమ పార్టీకి 80 సీట్లకు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు నీలకంఠాపురం రఘువీరా రెడ్డి.
Also Read : Bhatti Vikramarka : కేసీఆర్ లో ఓటమి భయం