Nadendla Manohar : గుంటూరు – జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సామాన్యులకే కాదు ఉద్యోగులకు కూడా భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్ పై అకారణంగా దాడికి దిగడం దారుణమన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. జనసేన పార్టీ పరంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
Nadendla Manohar Slams AP Govt
కావలిలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇలా ఎంత కాలం దాడులు చేసుకుంటూ పోతారని ప్రశ్నించారు మనోహర్. వైసీపీ మూకలను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం పెచ్చరిల్లి పోయిందని అన్నారు. అభివృద్ది అన్న మాట కనిపించకుండా పోయిందని ఆరోపించారు . ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ నిలదీశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు జగన్ చేతిలో ఉన్నాయని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , రాబోయే ఎన్నికల్లో తప్పకుండా వైసీపీకి గుణపాఠం చెప్పక తప్పదన్నారు జనసేన పీఏసీ చైర్మన్.
Also Read : Ponguleti Srinivas Reddy : కాంగ్రెస్ ఖాయం కేసీఆర్ పతనం