Nadendla Manohar : జగన్ పాలనలో జనం ఆగమాగం
నిప్పులు చెరిగిన నాదెండ్ల మనోహర్
Nadendla Manohar : అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ సర్కార్ వల్ల ఒరిగింది ఏమీ లేదన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. వైసీపీ చేసింది కొంచమేనని, దానిని గోరంతగా ప్రచారం చేసుకుందని ఆరోపించారు.
Nadendla Manohar Comments on AP CM YS Jagan
సామాజిక పింఛన్ల పేరుతో నెలకు రూ. 292 కోట్ల అవినీతికి పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది రూ. 3513.57 కోట్లు వైసీపీ నేతలు దోచుకున్నారని మండిపడ్డారు. మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారారని, వాళ్ల వల్ల రాష్ట్రానికి భారం తప్ప ఒరిగింది ఏమీ లేదన్నారు నాదెండ్ల మనోహర్.
సంక్షేమం ముసుగులో జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) మీడియాతో మాట్లాడారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు నాదెండ్ల మనోహర్. రాబోయే రోజుల్లో వైసీపీని బండ కేసి కొట్టడం ఖాయమని జోష్యం చెప్పారు. 175 స్థానాలకు గాను తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా విజయం సాధిస్తాయని, అధికారంలోకి వస్తామన్నారు.
Also Read : Sridhar Babu : అప్పుల కుప్ప తప్పుల తడక