Nadendla Manohar : భూ సేకరణ పేరుతో వేల కోట్ల దందా
జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్
Nadendla Manohar : అమరావతి – భూ సేకరణ పేరుతో వేల కోట్ల దందాకు తెర తీశాడంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు ఇచ్చినట్లు చెబుతున్న పట్టాలు పూర్తిగా అబద్దం అని ఆరోపించారు. అసలు ఇవి ఇంటి పట్టాలే కాదని పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్. అవి కేవలం పొసిషన్ ధ్రువపత్రాలు మాత్రమేనని పేర్కొన్నారు.
Nadendla Manohar Slams AP CM YS Jagan
ఇచ్చిన పట్టాలు , కట్టించిన ఇళ్లు అన్ని లెక్కలు తప్పేనని స్పష్టం చేశారు . విచిత్రం ఏమిటంటే నివాసాలకు యోగ్యం కానీ స్థలాలను ఇచ్చారని ఇది మంచి పద్దతి కాదన్నారు నాదెండ్ల మనోహర్(Nadendla Manohar). ఇప్పటి దాకా 95 వేల 106 మంది తమకు ఇచ్చిన పట్టాలు వద్దు అని తిరిగి ఇచ్చేశారంటూ స్పష్టం చేశారు.
ఇప్పటి దాకా ఇచ్చిన పట్టాలు కొండలు, గుట్టలు, స్మశానాల్లో ఉన్నాయని అందుకే వాటిని వదులుకున్నారని ఇకనైనా సర్కార్ మారాలని సూచించారు నాదెండ్ల మనోహర్. అందుకే తాము టీడీపీతో కలిసి ఆందోళన కొనసాగించడం ప్రారంభించామన్నారు . ఉమ్మడి వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతరం కొనసాగుతుందన్నారు . రాబోయే కాలంలో టీడీపీ, జనసేన పార్టీలు సర్కార్ ఏర్పాటు ఖాయమని జోష్యం చెప్పారు.
Also Read: PM Modi Viral : ఫైనల్ పోరుకు మోదీ విశిష్ట అతిథి