Nadendla Manohar : రంగులు తప్ప అభివృద్ది ఎక్కడ
నిప్పులు చెరిగిన నాదెండ్ల మనోహర్
Nadendla Manohar : తెనాలి- జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష చేపట్టారు మనోహర్. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో అరాచక పాలన తప్ప ఇంకేమీ లేదన్నారు.
Nadendla Manohar Slams AP Govt
రాష్ట్రంలో గోడలకు రంగులు తప్ప అభివృద్ది అన్న ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు నాదెండ్ల మనోహర్(Nadendla Manohar). రాష్ట్ర భవిష్యత్తును త్వరలో జరిగే ఎన్నికలు నిర్వహించ బోతున్నాయని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో జగన్ తన ప్రచారం చేసుకోవడం తప్పా ఇంకేమీ చేయలేదంటూ ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ మోసాన్ని ప్రజల ముందు ఎండగట్టాలని పార్టీ నేతలు, కార్యకర్తలు , శ్రేణులకు పిలుపునిచ్చారు. పండగ తర్వాత పూర్తిగా ఎన్నికలపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు నాదెండ్ల మనోహర్. వైసీపీ రాక్షసులతో నిండి పోయిందని ఆరోపించారు. ఏ ఒక్కరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. మరోసారి గనుక గెలిస్తే రాష్ట్రం పూర్తిగా వల్లకాడు లాగా మారి పోతుందని హెచ్చరించారు.
Also Read : Nagendra Babu : పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలి