Naela Quadri Baloch : బ‌లూచిస్తాన్ పోరాట‌నికి మ‌ద్ద‌తు ఇవ్వండి

ఉద్య‌మ‌కార‌ణి ప్రొఫెస‌ర్ నేలా క్వాద్రీ బ‌లోచ్

Naela Quadri Baloch :  బ‌లూచిస్తాన్ లో అంత‌ర్యుద్దం కొన‌సాగుతోంది. స్వేచ్ఛ కోసం గ‌త కొన్నేళ్లుగా పాకిస్తాన్ తో యుద్దం జ‌రుగుతోంది. అక్క‌డ చిన్నారులు, మ‌హిళ‌లు, యువ‌తీ యువ‌కులు , వృద్దులు ఎంతో ఇబ్బంది ప‌డుతున్నారు.

పాకిస్తాన్ అది ఓ దేశం కాదు ఉగ్ర‌వాదుల‌కు, ఉగ్ర‌వాదానికి అది ఓ కేంద్రం. దాన్ని అంతం చేసేందుకు బ‌లూచిస్తాన్ తో భార‌త దేశం చేతులు క‌లుపాల‌ని తాను భార‌త దేశాన్ని కోరుతున్నాన‌ని తెలిపారు బలూచిస్తాన్ ఉద్య‌మ‌కారిణి, ప్రొఫెస‌ర నేలా క్వాద్రీ బ‌లోచ్(Naela Quadri Baloch).

శ‌నివారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నిరంకుశం త‌ప్ప అక్క‌డ ఏమీ లేద‌న్నారు. మాన‌వ‌త్వం అన్న‌ది మ‌చ్చుకైనా లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తాము పాకిస్తాన్ లో భాగంగా ఉండ ద‌ల్చుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు నేలా క్వాద్రీ బ‌లోచ్. ఈ ప్ర‌పంచంలో పుట్టిన ప్ర‌తి ఒక్క‌రికీ బ‌తికే హ‌క్కు ఉంటుంద‌ని మ‌రిచి పోకూడ‌ద‌న్నారు.

అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు, హ‌క్కులు ఉంటాయ‌ని కానీ పాకిస్తాన్ ఉగ్ర‌వాద దేశంలో వాటికి చోటు అనేది ఉండ‌ద‌న్నారు. ఈ విష‌యంలో అన్ని దేశాల కంటే భార‌త దేశం మెరుగైన రీతిలో ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌తీకగా నిలుస్తోంద‌ని చెప్పారు నేలా క్వాద్రీ బ‌లోచ్.

అందుకే ఉద్య‌మ‌కారుల‌మంతా భార‌త దేశంతో స‌త్ సంబంధాలు కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపారు. త‌మ ప్ర‌త్యేక బలూచిస్తాన్ ఉద్య‌మానికి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని బ‌లోచ్ కోరారు.

ప్ర‌స్తుతం ఆమె చేసిన వ్యాఖ్య‌లు పాకిస్తాన్ లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. గ‌త కొంత కాలం నుంచి బ‌లూచిస్తాన్ ప్ర‌త్యేక దేశంగా ఉండాల‌ని కోరుతోంది.

Also Read : దోషిగా తేలితే మంత్రిపై వేటు – టీఎంసీ

Leave A Reply

Your Email Id will not be published!