Nagam Janardhan Reddy : నాగంకు షాక్ కాంగ్రెస్ ఝ‌ల‌క్

కూచుకుళ్ల రాజేశ్ రెడ్డికి ఛాన్స్

Nagam Janardhan Reddy : హైద‌రాబాద్ – సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన రాజ‌కీయ నాయ‌కుడిగా, మాజీ మంత్రిగా పేరు పొందిన డాక్ట‌ర్ నాగం జ‌నార్ద‌న్ రెడ్డికి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌నను కాద‌ని ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి త‌న‌యుడు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డికి సీటు కేటాయించారు.

Nagam Janardhan Reddy Serious

119 సీట్ల‌కు సంబంధించి 55 మంది అభ్య‌ర్థుల‌తో తొలి జాబితాను ప్ర‌క‌టించారు. ఇందులో నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా నుంచి మొద‌టి నుంచీ పార్టీ కోసం ప‌ని చేస్తూ వ‌చ్చిన నాగం జ‌నార్దన్ రెడ్డిని(Nagam Janardhan Reddy) ప‌క్క‌న పెట్ట‌డం విస్తు పోయేలా చేసింది. ఇటీవ‌లే కూచుకుళ్ల‌తో పాటు జూప‌ల్లి కృష్ణారావుకు సీట్ల‌ను కేటాయించ‌డం విస్తు పోయేలా చేసింది.

మ‌రో వైపు ఇదే పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి చిక్కుడు వంశీకృష్ణ‌కు టికెట్ కేటాయించింది. ఆలంపూర్ కు సంత‌ప్ కుమార్ , కోడంగ‌ల్ కు రేవంత్ రెడ్డి కి కేటాయించారు. ఇదే స‌మ‌యంలో త‌న‌ను ప‌క్క‌న పెట్ట‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు నాగం అనుచ‌రులు. వ‌య‌సు భారం మీద ప‌డ‌డం, త‌న‌యుడు క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌క పోవ‌డం ఇబ్బందిగా మారింది.

Also Read : Mynampally Hanumantha Rao : పంతం నెగ్గించుకున్న మైనంప‌ల్లి

Leave A Reply

Your Email Id will not be published!