Nagam Janardhan Reddy : కాంగ్రెస్ మోసం నాగం ఆగ్రహం
త్వరలో కార్యాచరణ ప్రకటిస్తా
Nagam Janardhan Reddy : నాగర్ కర్నూల్ – మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీని స్థాపించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులపై కేసులు వేశారు. టీఆర్ఎస్ సర్కార్ పై, సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. అక్కడ ఇముడ లేక పోయారు నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardhan Reddy). ఆ తర్వాత హస్తం గూటికి చేరుకున్నారు.
Nagam Janardhan Reddy Serious Comments on Revanth Reddy
కొన్నేళ్లుగా నాగర్ కర్నూల్ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. అన్నీతానై వ్యవహరించారు. చివరి దాకా తనకు టికెట్ వస్తుందని భావించారు. అయితే ఉన్నట్టుండి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జంప్ అయిన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్ రెడ్డికి నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించింది కాంగ్రెస్ పార్టీ.
దీంతో బిగ్ షాక్ కు లోనయ్యారు నాగం. టికెట్లను ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆపై నాగర్ కర్నూల్ , కొల్లాపూర్ లలో రాజేష్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు.
తాను పార్టీని వీడబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తన రాజకీయ కార్యాచరణ ఏమిటో ప్రకటిస్తానని స్పష్టం చేశారు నాగం జనార్దన్ రెడ్డి.
Also Read : Yenugu Ravinder Reddy : బీజేపీకి షాక్ ఏనుగు జంప్