Nagavali Express: విజయనగరంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్
విజయనగరంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్
Nagavali Express : నాందేడ్ – సంబల్ పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్(Nagavali Express) కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయనగరం రైల్వేస్టేషన్ నుండి బయలుదేరిన కొన్ని నిమిషాలకు… గూడ్స్ షెడ్ వద్ద ఈ రైలు పట్టాలు తప్పింది. నగరంలోని చెన్నై షాపింగ్ మాల్ సమీపంలో ఉన్న రైల్వే అండర్ పాస్ వద్ద ఈ రైలు పట్టాలు తప్పడంతో పెద్ద ఎత్తున స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనలో రెండు భోగిలు ప్రక్కకు ఒరిగాయి. దీనితో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు… ప్రయాణికులను సురక్షితంగా భోగీల నుండి క్రిందకు దించారు. అనంతరం రెండు భోగీలను ట్రైన్ నుండి తొలగించారు. ప్రయాణీకులకు సపర్యలు చేసి… ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చారు. రైల్వే ట్రాక్ ను పునరుద్ధరించి… విజయనగరం – బొబ్బిలి లైన్ లో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్లియర్ చేసారు. మరోవైపు ఈ ఘటనపై రైల్వే అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు.
Nagavali Express Incident
నాగావళి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో… వాల్తేర్ డివిజన్ లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. విజయనగరం రైల్వే స్టేషన్ నుండి బయలు దేరి… చాలా స్లోగా వెళ్తుండగా ఈ రైలు పట్టాలు తప్పడంతో పెను ప్రమాదం తప్పింది. అంతేకాదు నగరం నడిబొడ్డున… నిత్యం రద్దీగా ఉండే చెన్నై షాపింగ్ మాల్ సమీపంలో ఉన్న రైల్వే అండర్ పాస్ వద్ద ఈ ఘటన జరగడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. అటువైపుగా వెళ్తున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి హార్ట్ ఆపరేషన్ సక్సెస్