Nalini EX DSP : సీఎం అభిమానం నళిని సంతోషం
రేవంత్ రెడ్డికి ఆత్మీయతతో లేఖ
Nalini EX DSP : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ డీఎస్పీ నళిని సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంపై సుదీర్ఘ లేఖ రాశారు. ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడిన ఈ ఉత్తరం ఇప్పుడు కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Nalini EX DSP Comment
నా పట్ల రేవంత్ రెడ్డి చూపిస్తున్న అభిమానానికి రుణపడి ఉన్నానని పేర్కొన్నారు. మీరు నా పట్ల కనబర్చిన ఆత్మీయత తనను ఎంతగానో కదిలించిందని తెలిపారు. ఇది తనకు ఎంతో సాంత్వన కలిగిస్తోందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తనను 3 ఏళ్లుగా చాలా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణ క్షణం గండంలా గడిచిందని పేర్కొన్నారు నళిని. 2009 డిసెంబర్ 9న తాను చేసిన రాజీనామా ఆనాడు కలకలం రేపిందని తెలిపారు.
ఆనాటి దివంగత సీఎం రోశయ్య తనకు జాబ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. నేను తిరిగి విధుల్లో చేరా. కానీ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. తనను ఉన్నత స్థానాల్లో ఉన్న తీవ్రమైన ఇబ్బందులు పెట్టారని తట్టుకోలేక పోయానని వాపోయారు. ఇదే నేను చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నారు నళిని.
Also Read : CM Revanth Reddy : బ్యారేజీల కుంగుబాటుపై విచారణ