Nana Patole : గ‌వ‌ర్న‌ర్ కామెంట్స్ పై కాంగ్రెస్ క‌న్నెర్ర‌

వెంట‌నే రాజీనామా చేయాల‌ని డిమాండ్

Nana Patole : గుజ‌రాతీలు, రాజ‌స్తానీలు గ‌నుక మ‌రాఠాను ఖాళీ చేస్తే ముంబై దేశ ఆర్థిక రాజ‌ధానిగా ఉండ‌దంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోషియారీ. ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

నిత్యం క‌ష్ట‌ప‌డే మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కావాల‌ని గ‌వ‌ర్న‌ర్ కించ ప‌రిచారంటూ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా ప‌టోలే. తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

ఒక రాష్ట్రానికి మొద‌టి పౌరుడిగా బాధ్య‌తలు నిర్వ‌హిస్తున్న గ‌వ‌ర్న‌ర్ అంద‌రి ప‌ట్ల స‌మాన దృష్టితో చూడాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

నానా పటోలే జాతీయ మీడియా ఎఎన్ఐతో శ‌నివారం మాట్లాడారు. ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ కామెంట్స్ తో మ‌రాఠా భ‌గ్గుమంటోంది.

గ‌వ‌ర్న‌ర్ ఇప్ప‌టికే తాను కేంద్రానికి తొత్తున‌ని నిరూపించు కున్నార‌ని ఇప్పుడు త‌న మాట‌ల‌తో మ‌రోసారి నైజాన్ని బ‌య‌ట పెట్టారంటూ మండిప‌డ్డారు నానా ప‌టోలే.

వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ త‌న త‌ప్పు తెలుసుకుని , మ‌రాఠా ప్ర‌జ‌లకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు నానా ప‌టోలే(Nana Patole).

కేంద్ర స‌ర్కార్ వెంట‌నే స్పందించి భ‌గ‌త్ సింగ్ కోషియారీని గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న‌లు చేప‌డుతుంద‌న్నారు.

ప్ర‌స్తుతం గ‌వర్న‌ర్ మాత్రం దీనిపై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. మ‌రో వైపు శివ‌సేన పార్టీ ఎంపీ సంజ‌య్ రౌత్ నిప్పులు చెరిగారు. మ‌రాఠా ప్ర‌జ‌లు ఎన్న‌టికీ గ‌వ‌ర్న‌ర్ ను క్ష‌మించ‌ర‌ని పేర్కొన్నారు.

Also Read : గ‌వ‌ర్న‌ర్ కామెంట్స్ సంజ‌య్ రౌత్ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!