Nana Patole : కాంగ్రెస్ పాలిట పవార్ శత్రువు
ఆ పార్టీ మరాఠా చీఫ్ నానా పటోలే
Nana Patole : ఓ వైపు బీజేపీ, శివసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతుంటే మహా వికాస్ అఘాడీలో కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అంతరం మరింత పెరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర చీఫ్ గత కొంత కాలం నుంచీ శరద్ పవార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని ముంచేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు.
పవార్ వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదన్నారు. తమ పార్టీని బలహీన పరిచేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. 2019లో భారతీయ జనతా పార్టీతో సుదీర్ఘ కాలం అనుబంధం కలిగి ఉన్న శివసేన పార్టీ తెదెంపులు చేసుకుంది.
ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా మొదటి నుంచి కాంగ్రెస్, ఎన్సీపీకి పడడం లేదు.
పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని తాను రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు జరిగిన నవ సంకల్ప్ చింతన్ శివిర్ లో పార్టీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకు వెళ్లానని నానా పటోలే (Nana Patole) చెప్పారు.
బ్లూ ప్రింట్ పూర్తయ్యాక ఈ అంశంపై చర్చిద్దామని హై కమాండ్ సూచించినట్లు వెల్లడించారు. గత రెండున్నర ఏళ్లుగా మరాఠాలో తమ పార్టీని బలపడకుండా అడ్డు పడుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు పటోలే (Nana Patole).
ప్రధానంగా జెడ్పీ, స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేయకుండా అడ్డు పడుతోందంటూ ధ్వజమెత్తారు.
Also Read : కూల్చి వేతలపై కేజ్రీవాల్ ఆగ్రహం