Nand Mulchandani : మరో ప్రవాస భారతీయుడికి అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీకి చెందిన నంద్ ముల్చందానీ (Nand Mulchandani )ప్రపంచంలోనే టాప్ రక్షణ శాఖగా పేరొందిన అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ (సీఐఏ ) కు టెక్నికల్ ఆఫీసర్ గా నంద్ ముల్చందానీ నియమించారు.
నంద్ ముల్చందానీకి యుఎస్ లోని సిలికాన్ వ్యాలీలో ఉన్న రక్షణ శాఖలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఒక ఎన్నారైకి అత్యున్నత పదవి దక్కడం ఇదే మొదటి సారి. డిఫెన్స్ శాఖలో ఈ పోస్ట్ దక్కడం విశేషం.
ఆయనే మొదటి నాన్ రెసిడెంట్ ఇండియన్ గా చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉండగా నంద్ ముల్చందనీ 1979-1987 మధ్య ఢిల్లీలోని బ్లూబెల్స్ స్కూల్ ఇంటర్నేషనల్ లో చదువుకున్నాడు.
సీఐఏ డైరెక్టర్ విలియం జె బర్న్స్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ముల్చందానీకి(Nand Mulchandani )సిలికాన్ వ్యాలీతో పాటు డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ లో 25 ఏళ్లకు పైగా పని చేసిన అనుభవం ఉంది.
ముల్చందానీకి గణనీయమైన ప్రైవేట్ రంగం, స్టార్టప్ , ప్రభుత్వ నైపుణ్యాన్ని సిఐఏకి అందజేయడంలో విశేషమైన కృషి చేశారని పేర్కొంది యుఎస్ డిఫెన్స్ డైరెక్టర్ బర్న్స్ .
గత కొంత కాలం నుంచి సాంకేతికతపై ఫోకస్ పెట్టాం. సీటీఓ స్థానం అత్యంత ప్రాముఖ్యమైనది. మా బృందంలో నంద్ ముల్చందానీ చేరడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.
ఇక ముల్చందానీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా సీఐఏ అత్యాధునిక ఆవిష్కరణలు ఉపయోగించుకునేలా చూస్తారని తెలిపారు. అంతే కాకుండా సీఐఏ మిషన్ ను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు కూడా దోహద పడతారని పేర్కొన్నారు.
Also Read : యుకెలో భారతీయ వైద్యుడి నిర్వాకం