Nandamuri Balakrishna : బావ దమ్మున్నోడు తిరిగి వస్తాడు
బావమరిది నందమూరి బాలకృష్ణ
Nandamuri Balakrishna : విజయవాడ – ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన బావ, టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. జగన్ పిచ్చి పీక్ స్టేజ్ కు చేరిందన్నారు.
Nandamuri Balakrishna Comments Viral
తన బావను రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే అక్రమంగా ఏపీ స్కిల్ స్కామ్ లో ఇరికించారంటూ నందమూరి బాలయ్య(Nandamuri Balakrishna) ఆరోపించారు. న్యాయం, ధర్మం తమ వైపు ఉందన్నారు. త్వరలోనే బావ బయటకు వస్తాడని , సత్తా చాటడం ఖాయమని జోష్యం చెప్పారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకే బావను జైలు పాలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ దెబ్బ తిన్న పులి ఎప్పటికైనా గర్జిస్తాడని , జగన్ కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారంటూ ఏపీ సీఐడీ ఆరోపించింది.
కేసుకు సంబంధించి రూ. 371 కోట్లు షెల్ కంపెనీల ద్వారా డబ్బులు చేతులు మారాయని, పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. 25 పేజీల రిమాండ్ రిపోర్టు ఏసీబీ కోర్టుకు సమర్పించింది. వాదోపవాదనలు విన్న అనంతరం జడ్జి హిమ బిందు సంచలన తీర్పు వెలువరించింది.
Also Read : Nara Lokesh : తండ్రి వెంట తనయుడు