Nandan Nilekani Donates : జయహో నందన్ నీలేకని
ఐఐటీ బాంబేకు రూ. 315 కోట్ల విరాళం
Nandan Nilekani Donates : తనకు జీవితాన్నిచ్చినందుకు రుణం తీర్చుకున్నారు ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేకని. అంతే కాదు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ) వ్యవస్థాపక చైర్మన్ గా కూడా ఉన్నారు. ఆధార్ కార్డుకు ఆయనే ఆద్యుడు. నందన్ నీలేకని(Nandan Nilekani) విద్యా రంగం ప్రాధాన్యతను గుర్తించారు. ఆయన కష్టపడి ఐఐటీ బాంబేలో చదివారు. తనను ఉన్నత స్థాయిలో చేరేందుకు దోహద పడినందుకు విద్యా సంస్థకు ఏకంగా రూ. 315 కోట్లు భారీ విరాళాన్ని ప్రకటించారు.
ఈ మేరకు సంస్థ డైరెక్టర్ సుభాష్ చౌదరికి అందజేశారు. ఈ దేశంలో ఎందరో సంపన్నులు ఉన్నారు. బడా వ్యాపారవేత్తలు, బిజినెస్ టైకూన్స్ , కార్పొరేట్ చైర్మన్ లు, సిఇఓలు, వ్యవస్థాపకులు, ఫౌండర్స్ ఉన్నారు. అందరూ తమ తమ దారుల్లో విద్యా సంస్థలకు నందన్ నీలేకని లాగా ఆలోచించి విరాళంగా ఇస్తే రాబోయే భావి తరాల విద్యార్థులకు మేలు చేసిన వారవుతారు. నీలేకని చేసిన ఈ భారీ సాయం చరిత్రలో నిలిచి పోతుందనడంలో సందేహం లేదు.
ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. ఈ భారీ విరాళాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , గ్రీన్ ఎనర్జీతో సహా ఇతర రంగాలలో పరిశోధనలకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా విద్యా సంస్థను కోరారు నందన్ నీలేకని. 1973లో ఆయన చదువుకున్నారు. 2023 సంవత్సరంతో సరిగ్గా 50 ఏళ్లవుతుంది. దీనికి గుర్తుగా ఆయన సాయం చేశారు. కొన్ని కోట్ల రూపాయలను ఇంతకు ముందు కూడా విరాళంగా అందజేశారు నందన్ నీలేకని. ఐఐటీ బాంబేకు ఇప్పటి దాకా ఆయన అందించిన మొత్తం రూ. 400 కోట్లకు చేరుకుంది.
Also Read : Prof K Jayashankar : సారూ దండం నీకు సలాం
