#HeroNani : శ‌ర‌వేగంగా సిద్ద‌మ‌వుతున్న‌ ‘శ్యామ్‌ సింగరాయ్’

Nani ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న’టక్ జగదీశ్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న నేచురల్ స్టార్ నాని దానితో పాటుగా ‘శ్యామ్‌ సింగరాయ్’ కూడా పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించాడు.

Nani : ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న’టక్ జగదీశ్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న నేచురల్ స్టార్ నాని(Nani )దానితో పాటుగా ‘శ్యామ్‌ సింగరాయ్’ కూడా పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించాడు. ‘టాక్సీవాలా’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాహుల్‌ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నారు.

ప్ర‌స్తుతం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. ఈ మూవీలో సాయి పల్లవి, ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా . కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌.

కాగా క‌రోనా నేప‌థ్యంలో అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుని ఈ చిత్రం కోసం ముందు క‌ల‌క‌త్తా వెళ్లాల‌ని అనుకున్నా, ప్ర‌స్తుత ప‌రిస్థితి దృష్ట్యా రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేశారని చిత్ర యూనిట్ చెపుతున్న మాట‌. ఈ నెల 13 వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపి సంక్రాంతికి చిన్న బ్రేక్ ఇవ్వనున్నామ‌ని, త‌దుప‌రి ఇదే జోష్‌తో షూటింగ్ రవేగంగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నఈ సినిమాని వెంకట్‌ బోయిన్‌పల్లి నిర్మిస్తుండ‌గా మిక్కిజేమేయర్ సంగీతం అందిస్తున్నారు.

No comment allowed please