Nara Bhuvaneshwari : ఏపీ స‌ర్కార్ పై భువ‌నేశ్వ‌రి ఫైర్

పోలీసుల నోటీసుపై తీవ్ర ఆగ్ర‌హం

Nara Bhuvaneshwari : రాజ‌మండ్రి – ఏపీ ప్ర‌భుత్వం త‌మ ప‌ట్ల అనుస‌రిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు భార్య , లోకేష్ త‌ల్లి నారా భువ‌నేశ్వ‌రి . ఆమె మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు.

Nara Bhuvaneshwari Slams AP Govt

ఏపీ స్కిల్ స్కాం కేసులో కావాల‌ని త‌న భ‌ర్త చంద్ర‌బాబును ఇరికించార‌ని, అడ్డగోలుగా అరెస్ట్ చేశార‌ని, ఆయ‌న‌ను చిత్ర హింస‌ల‌కు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఆయ‌న‌కు ఫ్యాన్ సౌక‌ర్యం లేద‌ని వాపోయారు.

చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా రాజ‌మండ్రిలో ఉన్న త‌న‌ను క‌లిసి , మ‌నో ధైర్యాన్ని ఇచ్చేందుకు టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేప‌ట్టార‌ని, ఇందులో త‌ప్పేముంద‌ని నిల‌దీశారు నారా భువ‌నేశ్వ‌రి(Nara Bhuvaneshwari). పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు త‌మ బిడ్డ‌ల లాంటి వాళ్ల‌ని పేర్కొన్నారు. బాధ‌లో ఉన్న త‌మ‌ను ఎవ‌రైనా క‌ల‌వాల‌ని అనుకుంటార‌ని ఇందుకు నోటీసులు ఇస్తే ఎలా అని ప్ర‌శ్నించారు.

ప్ర‌జ‌లతో పాటు పార్టీ సానుభూతి ప‌రులు, సీబీఎన్ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు త‌న‌ను క‌లవ కూడ‌ద‌ని చెప్పే హ‌క్కు ఎక్క‌డిద‌ని నిల‌దీశారు నారా భువ‌నేశ్వ‌రి.

Also Read : Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

Leave A Reply

Your Email Id will not be published!