Nara Bhuvaneshwari : బాధిత కుటుంబాలకు టీడీపీ భరోసా
నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు
Nara Bhuvaneshwari : చంద్రగిరి – ఏపీ స్కిల్ స్కాం కేసులో అక్రమంగా నారా చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చేయడాన్ని జీర్ణించు కోలేని పార్టీ కార్యకర్తలు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు నారా భువనేశ్వరి. ప్రతి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. గుండె పోటుతో మరణించిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. వారికి భరోసా కల్పించారు.
Nara Bhuvaneshwari Visit Victims Houses
ప్రవీణ్ రెడ్డి , చిన్నబ్బ కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari). ఇదిలా ఉండగా భువనేశ్వరికి మద్దతుగా చంద్రగిరి నియోకవర్గ పరిధిలోని అగరాలలో నిజం గెలవాలి పేరుతో టీడీపీ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు నారా భువనేశ్వరి. తిరుపతి జిల్లాలో మూడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. తన అరెస్ట్ ను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవడం పట్ల చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు.
గత నెల సెప్టెంబర్ 25న చిన్నబ్బ , అక్టోబర్ 17న ప్రవీన్ రెడ్డి చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారని వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు భువనేశ్వరి.
Also Read : Pawan Kalyan : అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ