Nara Brahmani : నారా బ్రాహ్మణికి సంఘీభావం
కలిసిన తూర్పుగోదావరి నేతలు
Nara Brahmani : రాజమండ్రి – ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ప్రస్తుతం ఏపీ సీఐడీ విచారణ చేపట్టింది. ఈ తరుణంలో బాబు భార్య భువనేశ్వరి , కోడలు , హెరిటేజ్ ఎండీ , నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి రాజమండ్రిలో కొలువు తీరారు.
దీంతో నారా బ్రాహ్మిణిని సంఘీ భావం తెలిపారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీల నేతలు. తాము ముందుకు రావాలని కోరారు. తాము కూడా మీ వెంట ఉంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
Nara Brahmani Met TDP Leaders
ఇదిలా ఉండగా తనను కలిసిన టీడీపీ నేతలతో మాట్లాడారు నారా బ్రాహ్మిణి(Nara Brahmani ). తమ మామ నారా చంద్రబాబు నాయుడు ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఆయన త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారని ప్రకటించారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో తన మామ చంద్రబాబుకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని చెప్పారు నారా బ్రాహ్మిణి. దేశ వ్యాప్తంగా అరెస్ట్ అక్రమమని పేర్కొంటున్నారని తెలిపారు. ఏదో ఒకరోజు సత్యం బయటకు వస్తుందన్నారు.
ఇదిలా ఉండగా ఛలో రాజమండ్రికి పిలుపునిచ్చారు ఐటీ ఉద్యోగులు. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనిపై మండిపడ్డారు నారా లోకేష్.
Also Read : Yanamala Ramakrishnudu : జగన్ ది పైశాచిక ఆనందం