Nara Chandrababu Naidu: నంధ్యాల ఘటనపై చంద్రబాబు విచారం !

నంధ్యాల ఘటనపై చంద్రబాబు విచారం !

Nara Chandrababu: నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో మట్టె మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై అర్ధరాత్రి మట్టిమిద్దె కూలడంతో తల్లపురెడ్డి గురుశేఖర్‌తో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. గురుశేఖర్‌ రెండో కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరులో పదో తరగతి చదువుతోంది. రాత్రికి రాత్రి కుటుంబంలో తల్లిదండ్రులు సహా తోబుట్టువులు చనిపోవడంతో ప్రసన్న అనాథ అయ్యింది.

Nara Chandrababu Naidu Orders..

ఈ ఘటనపై సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి… ప్రసన్నకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం తరఫున రూ.10లక్షల సాయం ప్రకటించారు. ప్రస్తుతం ప్రసన్న … తన నాయనమ్మ నాగమ్మ సమక్షంలో ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రసన్న పేరుతో రూ. 10లక్షలు డిపాజిట్‌ చేయడంతో పాటు, వృద్ధురాలైన నాగమ్మకు రూ.2లక్షలు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు ఆ బాలికను కలిసి ధైర్యం చెప్పాలని సూచించారు. మరోవైపు పార్టీ పరంగా కూడా ప్రసన్నకు బాసటగా నిలుస్తామన్నారు. బాలిక సంరక్షణ, విద్య విషయంలో పార్టీ నుంచి కూడా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు(Nara Chandrababu Naidu) ప్రకటించారు. మ‌ట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన ఘ‌ట‌న‌పై చలించిన సీఎం చంద్రబాబు

నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో అర్థరాత్రి స‌మ‌యంలో మ‌ట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో న‌లుగురు మృతి చెందారు. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై అర్థరాత్రి మట్టి మిద్దె కూలడంతో వంగలి గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురుశేఖర్ తో పాటు ఆయ‌న భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. వర్షాలకు నాని మిద్దె కూలిపోయింది. దీనితో నిద్రలోనే గురుశేఖర్ తో పాటు భార్య దస్తగిరమ్మ, కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి ప్రాణాలు కోల్పోయారు. రెండో కుమార్తె తల్లపురెడ్డి గురు ప్రసన్న(15) ప్రొద్దుటూరులో 10వ తరగతి చదువుకుంటోంది. రాత్రికి రాత్రి కుటుంబంలో తల్లిదండ్రులతో సహా తోబుట్టువులు చనిపోవడంతో ప్రసన్న అనాథ అయ్యింది.

Also Read : Danam Nagender: నన్ను కించపరచడం వలనే సహనం కోల్పోయా – దానం నాగేందర్‌

Leave A Reply

Your Email Id will not be published!