Nara Lokesh : చిరంజీవి అన్న దాంట్లో తప్పేముంది
ఏపీ సర్కార్ ను నిలదీసిన నారా లోకేష్
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. యువ గళం పాదయాత్రలో భాగంగా ఆయన ప్రసంగించారు. మెగాస్టార్ చిరంజీవిని మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని విమర్శించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది వారి ప్రభుత్వం చేతగాని తనాన్ని తెలియ చేస్తుందని అన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రభుత్వం అన్నాక ఆరోపణల్ని, విమర్శల్ని స్వీకరించాలే తప్పా ఎదుటి వారిపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు.
Nara Lokesh Shocking Comments
టాలీవుడ్ ఎందరికో నీడను ఇస్తోందన్నారు. దాని మీద ఆధారపడిన కార్మికులు వేలాది మంది ఉన్నారని తెలిపారు నారా లోకేష్(Nara Lokesh). అదేదీ తెలుసు కోకుండా ఇలా అవాకులు చెవాకులు పేలితే ఎలా అని నిలదీశారు. ప్రత్యేక హోదా ఏమైదని , ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కావడం లేదని, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని మెగాస్టార్ సూచించారని ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదన్నారు.
ఇవన్నీ గతంలో ఎన్నికల సందర్భంగా ఏపీ సీఎం జగన్ రెడ్డి హామీలు ఇచ్చినవే ఉన్నాయన్నారు. ఉపాధి కల్పించేందుకు దృష్టి పెట్టాలని సూచించడం నేరమా అని మండిపడ్డారు నారా లోకేష్. వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతోంది. జగన్ ఏపీకి అప్పులు తప్ప వెలగబెట్టింది ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు.
Also Read : Mohammad Azaharuddin : అజారుద్దీన్ కు చేదు అనుభవం