Nara Lokesh : మూడు రాజధానుల ఊసెత్తని జగన్
జగన్ ను ప్రశ్నించిన నారా లోకేష్
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. యువ గళం పాదయాత్రలో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీ సీఎంగా కొలువు తీరిన జగన్ మోహన్ రెడ్డి హామీల పేరుతో మోసం చేశాడని ఆరోపించారు.
Nara Lokesh Comments on CM YS Jagan
నిన్నటి వరకు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానని నమ్మించాడని, ఇవాళ దాని గురించే ఊసెత్తడం లేదంటూ మండిపడ్డారు. సంక్షేమ పథకాల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించడంలో సక్సెస్ అయ్యాడని, కానీ జనం ఇబ్బందులను పరిష్కరించడంలో ఫోకస్ పెట్టడం లేదని ధ్వజమెత్తారు నారా లోకేష్(Nara Lokesh ).
వైసీపీ పాలన నాలుగు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి దాకా మూడు ఇటుకలు కూడా పెట్ట లేదంటూ ఎద్దేవా చేశారు. విశాఖ పట్టణంలో ఒక బస్ షెల్టర్ కట్టాడు. అది పునాదులు లేని ధర్మాకోల్ బస్ షెల్టర్ , సాయంత్రం వేళ చిన్న గాలి వచ్చింది. ఉన్నట్టుండి అది కూలి పోయిందని ఇది జగన్ పాలనకు నిదర్శనం అని సెటైర్ వేశారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , జగన్ పాలనకు అంతమయ్యే రోజు తప్పకుండా వస్తుందన్నారు నారా లోకేష్. జగన్ రెడ్డికి మూడిందని ఇక ఆయనను ఇంటికి సాగనంపడం తథ్యమని జోష్యం చెప్పారు.
Also Read : CJI Chandrachud Comment : సీజేఐ ప్రశ్నలకు జవాబు ఏది