Nara Lokesh : రెండో రోజు లోకేష్ విచారణ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ – అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం కేసులో కీలకమైన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) బుధవారం కూడా ఏపీ సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు.
Nara Lokesh CID Investigation
నిన్న సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా మొత్తం ఏపీ సీఐడీ అధికారులు 50 ప్రశ్నలు సంధించారు. ఇందులో 49 ప్రశ్నలు గూగుల్ లో వెతికితే దొరుకుతాయంటూ స్పష్టం చేశారు నారా లోకేష్.
తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం కావాలని కక్ష సాధింపుతో తన తండ్రి నారా చంద్రబాబు నాయుడును జైలులో ఉంచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి తప్పు చేయని తనను , మాజీ మంత్రి నారాయణను కూడా ఇరికించారంటూ ఆరోపించారు నారా లోకేష్.
ప్రజలు అంతా గమనిస్తున్నారని , త్వరలో జరిగే ఎన్నికల్లో మార్పు తథ్యమని జోష్యం చెప్పారు. ఇదిలా ఉండగా ఏపీ సీఐడీ ఇప్పటికే నారా లోకేష్ ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ కేసులో ఎ14గా చేర్చింది.
Also Read : Jana Reddy : ఫోర్ మెన్ కమిటీ చీఫ్ గా జానా