Nara Lokesh : లోకేష్ అరెస్ట్ కు అనుమతి ఇవ్వండి
ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు
Nara Lokesh : అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. నోటీసులు కూడా అందజేసింది. ఇదిలా ఉండగా మరోసారి తనను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేయడం కలకలం రేపింది.
Nara Lokesh Viral
మరో వైపు తెలుగుదేశం పార్టీ, జనసేన తో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఏపీలో ఎన్నికల పర్యవేక్షణ, ఏర్పాట్లకు సంబంధించి సమీక్ష చేపట్టారు. ఇదే సమయంలో పోలేపల్లిలో సభను నిర్వహించారు.
ఈ క్రమంలో ఉన్నట్టుండి నారా లోకేష్(Nara Lokesh) ను కంట్రోల్ చేసేందుకు గాను ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. 41ఏ నోటీసులో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించింది పిటిషన్ లో. చంద్రబాబు కేసు దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని సీఐడీ అధికారులు ఆరోపించారు. జైలుకు పంపిస్తామని ప్రకటించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
Also Read : Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎంకు ఈడీ సమన్లు జారీ