Nara Lokesh : యువ గళం పేరుతో చేపట్టిన పాదయాత్ర టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొనసాగుతోంది. జనం ఆదరిస్తున్నారు. తమ సమస్యలను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సావధానంగా వింటూ వాటిని రాసుకుంటున్నారు నారా లోకేష్(Nara Lokesh). ఆయన ఎక్కడికి వెళ్లినా ముందు ఆ ప్రాంతంలో ఏమేం సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత స్థానికులతో, ఇతర వర్గాలతో భేటీ అవుతున్నారు. మరికొన్ని చోట్ల ముఖా ముఖి నిర్వహిస్తున్నారు. వినుకొండలో తనకు బ్రహ్మరథం పట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు నారా లోకేష్.
Nara Lokesh Words
ప్రజలు భరించ లేని స్థితిలో ఉన్నారని జగన్ పాలనను చూసి. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులలోకి నెట్టి వేశాడని ఆరోపించారు. సైకీ సీఎం జగన్ రెడ్డి వల్ల ఇక్కడ ఇసుక మాఫియా చెలరేగుతోందని, వారిని కట్టడి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు నారా లోకేష్. అన్ని మాఫియాలు కలిసి ఇవాళ రాష్ట్రాన్ని ఏలుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , తాము అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు .
జగన్ అరాచక పాలనను చూసి జనం విసిగి పోయారని ధ్వజమెత్తారు. అయినా సీఎంలో ఇసుమంతైనా చలనం అన్నది లేకుండా పోయిందన్నారు. రాబోయే కాలం తమదేనని పేర్కొన్నారు.
Also Read : Jupally, Kuchukulla : స్వంత గూటికి జూపల్లి, కూచుకుళ్ల