Nara Lokesh Yatra : పేరెంట్స్ ఆశీర్వాదం యాత్రకు సిద్దం
యువ గళం కోసం కదిలిన నారా లోకేష్
Nara Lokesh Yatra : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం కోసం(Nara Lokesh Yatra) సిద్దమయ్యారు. ఆయన 400 రోజుల పాటు 4,000 వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తన తండ్రికి కంచుకోటగా పేరొందిన కుప్పం నుంచి యువ గళం పేరుతో చేపట్టిన యాత్రను జనవరి 27 నుంచి శ్రీకారం చుట్టనున్నారు.
ఇప్పటికే పార్టీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా బుధవారం యాత్ర చేపట్టే కంటే ముందు తన తల్లిదండ్రులు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి పాదాలకు నమస్కరించారు. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తన మామ, నటుడు నందమూరి బాలకృష్ణ , అత్తలకు నమస్కరించారు నారా లోకేష్. వారి ఆశీస్సులు అందుకున్నారు.
అనంతరం ఆయనకు తిలకం దిద్దారు సాగనంపారు భార్య నారా బ్రాహ్మణి. ఈ సందర్భంగా యాత్ర దిగ్విజయం కావాలని కోరారు పేరెంట్స్, అత్తమామలు. ఇదిలా ఉండగా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రకు(Nara Lokesh Yatra) మొదట అభ్యంతరం తెలిపింది ప్రభుత్వం. దీనిని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించగా ఓకే చెప్పింది. చివరకు సర్కార్ దిగి వచ్చింది.
యువ గళంకు లైన్ క్లియర్ చేసింది. ఈ తరుణంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. 14 షరతులతో పాదయాత్రకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏ మాత్రం వాటిని పట్టించుకోక పోతే వెంటనే యువ గళంను నిలిపి వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. మొత్తం లోకేష్ యాత్ర 110 నియోజకవర్గాలలో కొనసాగనుంది.
Also Read : జనసేన కాదది చంద్రసేన – రోజా