Nara Lokesh : తండ్రి వెంట త‌న‌యుడు

రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు

Nara Lokesh : రాజ‌మండ్రి – ఏపీ స్కిల్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు. విజ‌య‌వాడ నుంచి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. అర్ధ‌రాత్రి 2.30 గంట‌ల‌కు జైలుకు త‌ర‌లించారు. ఆయ‌న‌కు ప్ర‌త్యేక వ‌స‌తి క‌ల్పించారు.

Nara Lokesh Meet his Father

చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల కోరిక మేర‌కు ఇంటి వ‌ద్ద నుండి భోజ‌నం, మందులు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు అనుమ‌తించింది. మ‌రో వైపు చంద్ర‌బాబు నాయుడు వ‌య‌సు 73 ఏళ్లు అని, ఆయ‌న‌ను గృహ నిర్బంధం విధించాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఇంటి భోజ‌నంతో పాటు మందులు ఇచ్చేందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని కోరారు. ఇక రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు ప‌రిస‌రాల‌లో సెక్ష‌న్ 30ని విధించారు. ఎవ‌రికీ అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశారు పోలీసులు. రాత్రి చంద్ర‌బాబు నాయుడును త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో కుటుంబీకులు ఉన్నారు.

రోజుకు ఇద్ద‌రు లేదా ముగ్గురుకు మాత్ర‌మే చంద్ర‌బాబును ప‌రామ‌ర్శించేందుకు వీలు ఉంటుంద‌ని జైల‌ర్ స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం ఉద‌యం నారా లోకేష్(Nara Lokesh) త‌న తండ్రిని క‌లుసుకున్నారు. ఆ వెంట‌నే తిరిగి విజ‌య‌వాడ‌కు వెళ‌తారు. న్యాయ‌వాదుల‌తో త‌దుప‌రి ఏం చేయాల‌న్న దానిపై చ‌ర్చించ‌నున్నారు.

Also Read : Chandrababu Naidu : రాజ‌మండ్రి జైలుకు చంద్ర‌బాబు

Leave A Reply

Your Email Id will not be published!