Nara Lokesh Police : పోలీసులపై వైకాపా దాడి దారుణం
పూర్తిగా ఖండిస్తున్నాన్న నారా లోకేష్
Nara Lokesh Police : రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పేందుకు అనంతపురంలో చోటు చేసుకున్న తాజా ఘటన ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh). సెబ్ పోలీస్ లో ఎస్ఐతో పాటు మహిళా కానిస్టేబుల్ పై దాడికి దిగిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రధాన అనుచరుడు సాకే చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ మద్యం కేసులో పట్టుబడిన వ్యక్తిని వదిలి పెట్టాలంటూ దాడికి దిగడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు నారా లోకేష్.
Nara Lokesh Police Words
రాష్ట్రంలో మహిళా పోలీసులకే రక్షణ లేక పోతే ఇక మహిళల , సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు వైసీపీ నేతల ఆగడాలు మితిమీరి పోతున్నాయని వాపోయారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగడం లేదని రాజా రెడ్డి పాలన కొనసాగుతోందంటూ ధ్వజమెత్తారు.
ఇంత జరుగుతున్నా జిల్లా ఎస్పీ కానీ , డీజీపీ కానీ ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. నిద్ర పోతున్నారా అని మండిపడ్డారు. ఇకనైనా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని లేక పోతే సైకోలుగా మారిన వైసీపీ నేతలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు నారా లోకేష్.
Also Read : Puvvada Ajay Kumar : ఆర్టీసీకి ఢోకా లేదు – పువ్వాడ