Nara Lokesh : నా తండ్రి అరెస్ట్ అక్ర‌మం

టీడీపీ నేత నారా లోకేష్

Nara Lokesh : రాజోలు – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అర్ద‌రాత్రి హై డ్రామా త‌ర్వాత నంద్యాల‌లో ఏపీ సీఐడీ ఆధ్వ‌ర్యంలో టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడును అరెస్ట్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఉద్రిక్త‌త నెల‌కొంది.

Nara Lokesh Comments on his Father Arrest

త‌న తండ్రి చంద్ర‌బాబు నాయుడిని అరెస్ట్ చేయ‌డంపై స్పందించారు నారా లోకేష్(Nara Lokesh). త‌న తండ్రిని అక్ర‌మంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా ఆయ‌న రాజోలు మండల ప‌రిధిలోని పొద‌లాడ వ‌ద్ద ఆందోళ‌నకు దిగారు.

త‌న‌ను త‌న తండ్రిని చూసేందుకు వెళ్లేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. చూసేందుకు వెళుతున్న త‌న‌ను న‌డి రోడ్డుపై నిర్బంధించారంటూ ఆరోపించారు. నా పాద‌యాత్ర‌పై వైకాపా రౌడీ మూక‌ల‌తో రాళ్లు వేయించారంటూ ధ్వ‌జ‌మెత్తారు నారా లోకేష్. ఫిర్యాదు చేస్తే త‌మ వారిపై తిరిగి కేసులు న‌మోదు చేయించారంటూ ఫైర్ అయ్యారు.

పొద‌లాడ వ‌ద్ద నారా లోకేష్ వెళ్ల‌కుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల‌కు, నారా లోకేష్ కు మ‌ధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. త‌న తండ్రి పేరు ఎఫ్ఐఆర్ లో లేనే లేద‌న్నారు. జ‌గ‌న్ రెడ్డి త‌ల‌కిందులు చేసినా నిరూపించ లేరంటూ జ‌గ‌న్ రెడ్డిపై ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : Chandrababu Naidu : ఎఫ్ఐఆర్‌లో నా పేరు లేదు

Leave A Reply

Your Email Id will not be published!