Nara Lokesh : బాబును చంపేందుకు కుట్ర
టీడీపీ నేత నారా లోకేష్
Nara Lokesh : రాజమండ్రి – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు టీడీపీ జాతీయ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
Nara Lokesh Comments Viral
ఈ సందర్బంగా తన తండ్రి అనారోగ్యం గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్(Nara Lokesh) మీడియాతో మాట్లాడారు. అనారోగ్య కారణాలతో చంద్రబాబు నాయుడును అంతం చేయాలని కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపించారు.
వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తన తండ్రిని రిమాండ్ లోనే ఉంచాలనే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుని ముద్దాయి అని హెల్త్ బులెటిన్‍లో పదే పదే పేర్కొనేందుకు పెట్టిన శ్రద్ధ ఆయన ఆరోగ్యం, భద్రతపై పెట్టడం లేదని ఆవేదన చెందారు నారా లోకేష్.
జైలులో భద్రత లేదని, తన తండ్రి ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణహాని తలపెడుతున్నారని ఆరోపించారు. ఏ తప్పూ చేయని చంద్రబాబు పట్ల ఈ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తన తండ్రి ఆరోగ్యం పట్ల జైలు అధికారుల తీరు దారుణంగా ఉందన్నారు. ఆయన జీవితం ప్రమాదంలో ఉందన్నారు.
Also Read : TS DSC Post Poned : డీఎస్సీ పరీక్ష వాయిదా