Nara Lokesh : జగన్ పాలనలో 800 కంపెనీలు మూత
ఏపీ సీఎం జగన్ పై లోకేష్ ఆగ్రహం
Nara Lokesh : రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమను జగన్ రెడ్డి సర్వ నాశనం చేశాడని ఆరోపించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh). యువ గళం పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో గ్రానైట్ ప్రతినిధులతో నారా లోకేష్ ముఖాముఖి చేపట్టారు. తమ హయాంలో రూ. 4 ఉన్న యూనిట్ విద్యుత్ ధర జగన్ పాలనలో రూ. 7కి చేరిందన్నారు. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడని పవర్ లోకి వచ్చాక మరిచి పోయాడని ఆరోపించారు.
Nara Lokesh Comments
వైసీపీ పాలనలో 800 ఫ్యాక్టరీలు మూత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రానైట్ ఎక్స్ పోర్ట్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నట్లు బాధితులు తెలిపారు. కృష్ణపట్నం పోర్టు అదానీకి ఇచ్చారని, దీని వల్ల ఇక్కడి కంపెనీలకు ఛాన్స్ లేకుండా పోయిందని వాపోయారు. ఒక్కో కంపెనీకి రూ. 60 వేలు అదనంగా ఖర్చవుతోందన్నారు.
రాయల్టీ తగ్గిస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు 100 శాతం పెంచి తమ పొట్ట కొట్టాడంటూ కన్నీటి పర్యంతం అయ్యారు గ్రానైట్ వ్యాపారులు. తమపై ఫైన్లు వేసి వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఓవర్ లోడు పేరుతో కేసులు నమోదు చేస్తున్నారంటూ మండిపడ్డారు. గతంలో 400 లారీలు తిరిగేవని, కానీ ఇప్పుడు కేవలం 40 లారీలు మాత్రమే తిరుగుతున్నాయని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక గ్రానైట్ వ్యాపారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు నారా లోకేష్.
Also Read : Mopidevi Venkata Ramana : సీట్లను అమ్ముకున్న ద్రోహి ‘బాబు’