Nara Lokesh : జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
Nara Lokesh : పుంగనూరులో చోటు చేసుకున్న ఘటనపై తీవ్రంగా స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh). యువ గళం పాదయాత్రలో భాగంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సైకో జగన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన చెందారు. ఒక రకంగా చెప్పాలంటే ఖూనీ అయ్యిందన్నారు. రాజారెడ్డి రాచరిక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి తగిన రీతిలో బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే టీడీపీకి వస్తున్న జనాదరణను చూసి తట్టుకోలేక తమపై దాడులకు దిగుతున్నారంటూ మండిపడ్డారు.
Nara Lokesh Said
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అంత సీన్ లేదన్నారు. పుంగనూర్ లో ఘర్షణకు తెర తీసింది వైసీపీ శ్రేణులని, కానీ పోలీసులు తమ వారిని టార్గెట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు నారా లోకేష్. ఖాకీల సమక్షంలోనే తమ వారిపై దాడికి దిగితే ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం చేశారంటూ ఆరోపంచారు. సైకో జగన్ ఫ్యాక్షన్ పాలనకు చరమ గీతం పాడాలన్నారు.
వాళ్లే దాడి చేసి వారే బంద్ చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ గూండా మూకలు బంద్ నెపంతో చిత్తూరులో అమర్ రాజా కంపెనీ బస్సును ధ్వంసం చేశారని , ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు నారా లోకేష్.
Also Read : Arvind Kejriwal : సుప్రీం తీర్పు ప్రశంసనీయం – కేజ్రీవాల్