Nara Lokesh : వీసీ పోస్టులను బేరం పెట్టిన జగన్
నారా లోకేష్ సంచలన కామెంట్స్
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ప్రధానంగా ఉన్నత విద్యా వ్యవస్థను నాశనం చేశాడని ఆరోపించారు. ఒకప్పుడు వైస్ ఛాన్స్ లర్స్ అంటే ఎంతో గౌరవం ఉండేదని కానీ జగన్ కొలువు తీరాక వారికి విలువే లేకుండా చేశాడని ఆవేదన చెందారు. చివరకు ఎంత దిగజారాడంటే వీసీ పోస్టులను సైతం అమ్మకానికి పెట్టాడని ఆరోపించారు. ఆలోచనలకు, పరిశోధనలకు కేరాఫ్ గా ఉండాల్సిన యూనివర్శిటీలు ఏపీలో ఇప్పుడు రాజకీయ కేంద్రాలుగా మారాయని వాపోయారు నారా లోకేష్.
Nara Lokesh Slams YS Jagan
యువ గళం పాదయాత్రలో భాగంగా ఆయన ప్రసంగించారు. యువతతో ముఖా ముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వైసీపీ పాలన అంతా అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. తాము పవర్ లోకి రావడం ఖాయమని, వచ్చాక అన్ని యూనివర్శిటీలను ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. విచారణ జరిపిస్తామని, అర్హులైన వారిని ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.
విచిత్రం ఏమిటంటే జగన్ రెడ్డి పాలనలో మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్నారని అయినా వారి గురించి సీఎం ఆలోచించడం లేదన్నారు. కేవలం దోచుకోవడం పైనే ధ్యాస ఉంది తప్ప విద్యా రంగంపై దృష్టి పెట్టక పోవడం దారుణమన్నారు నారా లోకేష్.
Also Read : Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ