Nara Lokesh : పంచాయ‌తీ నిధుల దొంగ జ‌గ‌న్

టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్

Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చార‌ని ఆరోపించారు. గ్రామ పంచాయ‌తీల‌కు సంబంధించిన నిధుల‌ను దొడ్డి దారిన మ‌ళ్లించాడంటూ మండిప‌డ్డారు.

Nara Lokesh Slams Jagan Govt

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో వంద శాతం సిమెంట్ రోడ్లు, వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్లు, భూగ‌ర్భ మురుగు నీటి పారుద‌ల‌, సుర‌క్షిత‌మైన తాగు నీరు, పారిశుధ్యం, పింఛ‌న్లు, ఆహార భ‌ద్ర‌త‌, ఎల్ఈడీ వీధి దీపాలు, గ్యాస్ సిలిండ‌ర్లు అంద‌జేశామ‌ని అన్నారు.

ప్ర‌తి ఒక్క ఊరును స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దిన‌ట్లు స్ప‌ష్టం చేశారు నారా లోకేష్(Nara Lokesh). రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి తాము అద‌న‌పు నిధులు ఇచ్చి గ్రామాల‌ను ఆద‌ర్శ వంతంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నం చేశామ‌న్నారు. పంచాయ‌తీల‌కు కేంద్రం విడుద‌ల చేసిన 14, 15 క‌మిష‌న్ ఫైనాన్స్ నిధులు 9 వేల కోట్లు దొంగిలించాడ‌ని జ‌గ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు నారా లోకేష్.

రాష్ట్రంలో ఉన్న వ‌న‌రుల‌ను దోచుకున్నాడ‌ని, త‌న మంత్రివ‌ర్గం సైతం దోపిడీకి పాల్ప‌డ్డారంటూ ధ్వజ‌మెత్తారు. వ్య‌వ‌స్థ‌ల‌న్నింటిని స‌ర్వ నాశ‌నం చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ కే ద‌క్కుతుంద‌న్నారు.

Also Read : Mandava Venkateswara Rao : హ‌స్తం గూటికి ‘మండ‌వ‌’

Leave A Reply

Your Email Id will not be published!