Nara Lokesh : ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అది త్వరలో జరిగే ఎన్నికల్లో తేలుతుందన్నారు టీడీపీ నాయకుడు నారా లోకేష్. ఆయన యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. గురువారం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరాని ఆవేదన చెందారు. కానీ ప్రభుత్వం కేవలం మాటలు మాత్రమే చెబుతోందని చేతుల్లో చూపించడం లేదంటూ ఆరోపించారు.
తాము చేపట్టిన అభివృద్ది మాత్రమే ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తోందని కానీ వైసీపీ సర్కార్ చేసిన ఏ కార్యక్రమం ప్రత్యక్షంగా కనిపించడం లేదని ఆవేదన వ్యక్ం చేశారు. నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం రాయలసీమలో కొనసాగుతోంది. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు. వారి సమస్యలను సావధానంగా వింటున్నారు.
పనిలో పనిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేస్తున్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిలో సమాధానం చెపుతారని, ఆ సమయం త్వరలోనే వస్తుందన్నారు నారా లోకేష్. మార్పు తథ్యమని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని స్పష్టం చేశారు. ఇది తాను చేపట్టిన యువగళం పాదయాత్రలో అడుగడుగునా కనిపిస్తోందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పవర్ లోకి రావడం ఖాయమన్నారు.
Also Read : RS Praveen Kumar
