Nara lokesh : సర్కార్ నిర్లక్ష్యం టీడీపీ ఆగ్రహం
జగన్ రెడ్డిపై నారా లోకేష్ ఫైర్
Nara lokesh : అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యలు పేరుకు పోయాయని వాటిని పరిష్కరించడంలో జగన్ రెడ్డి విఫలం అయ్యారని ఆరోపించారు.
Nara lokesh Slams AP CM YS Jagan
పాదయాత్ర సందర్భంగా లెక్కకు మించి హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటిని మరిచి పోయారంటూ ధ్వజమెత్తారు నారా లోకేష్(Nara lokesh). అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు.
అంగన్ వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ రేపొద్దున సర్కార్ పై యుద్దం చేసేందుకు వలంటీర్లు కూడా సిద్దమయ్యారని చెప్పారు. ఇది ఒక రకంగా జగన్ కు పాలనపై పట్టు లేక పోవడాన్ని సూచిస్తుందన్నారు.
త్వరలో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి గెలుపొందడం ఖాయమని జోష్యం చెప్పారు నారా లోకేష్. ఉద్యమాలు చేసిన వారిపై దాడులకు దిగడం శోచనీయమన్నారు.
Also Read : KTR : బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీకే సీటు