Nara Lokesh : జగన్ రెడ్డీ పేదలకు ఇళ్లు ఎక్కడ – లోకేష్
తమ హయాంలోనే టిడ్కో ఇళ్లు
Nara Lokesh : టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. యువ గళం పాదయాత్రలో భాగంగా రాయలసీమ లోని ఆళ్లగడ్డలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కట్టిన ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
టిడ్కో ఇళ్లను తాము కట్టిస్తే జగన్ రెడ్డి హయాంలో ఇళ్లు కట్టించడంలో ఆలస్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. మాటలు చెప్పడం వరకే కానీ ఆచరణలో అంతా శూన్యమేనంటూ మండిపడ్డారు. పదే పదే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామంటూ చెబుతున్నారే తప్ప అసలైన అభివృద్ది ఎక్కడా కనిపించడం లేదన్నారు నారా లోకేష్. ఆళ్ల గడ్డలో తాము కట్టించిన ఇళ్లు తప్ప ఒక్కటి కూడా కొత్త వాటిని నిర్మించ లేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత నాలుగు సంవత్సరాల కాలంలో కేవలం 5 ఇళ్లు మాత్రమే కట్టించారని ఇది జగన్ ప్రభుత్వానికి పేదల పట్ల చిత్త శుద్దిని తెలియ చేస్తుందన్నారు. ఒక్క ఆళ్ల గడ్డలోనే తాము 3 వేల ఇళ్లు కట్టించామని ఇది తమకున్న నిబద్దత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 3.13 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడిదని స్పష్టం చేశారు. తాము కట్టించిన ఇళ్లకు వైసీపీ నాయకులు రంగులు వేయిస్తున్నారని ఆరోపించారు నారా లోకేష్.
Also Read : Sajjala Ramakrishna Reddy