Nara Lokesh : ఏపీలో మార్పు ఖాయం – లోకేష్

టీడీపీ నేత కీల‌క కామెంట్స్

Nara Lokesh : ఏపీలో ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని వాళ్లు ప్ర‌జా పాల‌న సాగించే స‌త్తా ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్ర‌మే ఉంద‌ని న‌మ్ముతున్నార‌ని అన్నారు టీడీపీ జాతీయ నేత నారా లోకేష్(Nara Lokesh). యువ గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా ఆదివారం ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. వ్య‌వ‌స్థ‌ల‌న్నీ నిర్వీర్య‌మై పోయాయ‌ని, పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు.

గ‌తంలో ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను జ‌గ‌న్ నెర‌వేర్చాడా అని ప్ర‌శ్నించారు నారా లోకేష్. తాను ఐటీ శాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తీసుకు వ‌చ్చిన కంపెనీలే త‌ప్పా ఒక్క‌ట‌న్నా కొత్త‌ది వ‌చ్చిందా అని ప్ర‌శ్నించారు. శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని ఆరోపించారు.

ప్ర‌జ‌లు ఈ పాల‌న‌ను భ‌రించ లేక పోతున్నార‌ని వెంట‌నే ఎన్నిక‌లు గ‌నుక వ‌స్తే త‌మ‌కు ప‌ట్టేందుకు సిద్దంగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్. దేశంలోనే మెరుగైన పాల‌న అంద‌జేసిన ఘ‌న‌త త‌మ ప్ర‌భుత్వానికి ద‌క్కుతుంద‌న్నారు.

మూడు రాజ‌ధానుల పేరుతో ఇంత కాలం నెట్టుకు వ‌చ్చాడ‌ని ఇప్పుడు కొత్త రాగం అందుకున్నాడంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌లు ఎంత కాలం ఈ అరాచ‌క పాల‌నను భ‌రిస్తార‌ని అన్నారు. ఏదో ఒక రోజు సాగ‌నంపాల్సిందేన‌ని పేర్కొన్నారు నారా లోకేష్‌. డీఎస్సీ నిర్వ‌హిస్తాన‌ని హామీ ఇచ్చాడ‌ని ఇప్పుడు ఎక్క‌డుంద‌ని అన్నారు .

Also Read : CM Siddaramaiah

Leave A Reply

Your Email Id will not be published!