Nara Lokesh : ఏపీలో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ

టీడీపీ నేత నారా లోకేష్

Nara Lokesh : విజ‌య‌వాడ – టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ అమ‌లు అవుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. జ‌గ‌న్ రెడ్డి తాను మాత్ర‌మే ఉండాల‌ని అనుకుంటున్నాడ‌ని అన్నారు.

Nara Lokesh Comments on Jagan

ఇక రాబోయే రోజుల్లో ఆయ‌న‌కు పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని హెచ్చ‌రించారు నారా లోకేష్(Nara Lokesh). చంద్ర‌బాబు నాయుడును అక్ర‌మంగా అరెస్ట్ చేసిన విధానం దారుణ‌మ‌న్నారు. దీనిని వ్య‌తిరేకిస్తూ పెద్ద ఎత్తున నిర‌స‌న‌, ఆందోళ‌న చేస్తున్నార‌ని దానిని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయంటూ ధ్వ‌జ‌మెత్తారు నారా లోకేష్‌.

శాంతియుతంగా నిర‌స‌న తెల‌పాల‌ని అనుకున్న విజ‌య‌వాడ లోని వివిధ కాలేజీల విద్యార్థుల‌పై పోలీసులు లాఠీ ఛార్జి చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాచ‌రిక పాల‌న సాగుతోందన్నారు.

సిద్దార్థ‌, పీవీపీ ఇంజ‌నీరింగ్ కాలేజీల్లోకి పెద్ద ఎత్తున పోలీసులు చొర‌బ‌డ‌టం అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు నారా లోకేష్.

సైకో జ‌గ‌న్ రెడ్డి రోజు రోజుకు వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లు నీకు త‌గిన గుణ‌పాఠం చెప్ప‌క త‌ప్ప‌ద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ నేత‌.

Also Read : CM KCR : అభివృద్ది న‌మూనా తెలంగాణ

Leave A Reply

Your Email Id will not be published!