Nara Lokesh : నా తండ్రిని కలిసే హక్కు లేదా
పోలీసులను నిలదీసిన లోకేష్
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. శనివారం తన తండ్రిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యగా ఆమె అభివర్ణించారు. మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండానే ఎలా తన ఫాదర్ ను అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. యువగళం పాదయాత్ర సందర్బంగా ఆయన రాజోలు మండలంలో రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల , ఏపీ ప్రభుత్వ కక్ష సాదింపు ధోరణిని నిరసిస్తూ నిరసన తెలిపారు.
Nara Lokesh Denied His Father Arrest
తాను తన తండ్రి వద్దకు వెళ్లకుండా పోలీసులు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఇదేమి ప్రజాస్వామ్యం అని నిలదీశారు నారా లోకేష్(Nara Lokesh). ఖాకీలతో వాగ్వావాదానికి దిగారు. ప్రజలు హర్షించరంటూ పేర్కొన్నారు. తన తండ్రి తప్పు చేయలేదన్నారు.
తన తండ్రి చంద్రబాబుకు 45 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందన్నారు. ఇప్పటి వరకు మచ్చ లేని నాయకుడిగా దేశంలో గుర్తింపు పొందారని చెప్పారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పాల్పడినా చివరకు నిర్దోషిగా బయటకు వస్తారంటూ స్పష్టం చేశారు నారా లోకేష్.
ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేసే ముందు సమాచారం ఇస్తారని, కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే ముందు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. దీనిని తాను ఖండిస్తున్నానని అన్నారు.
Also Read : Chandrababu Naidu : నేను నిప్పును ఎవరికీ భయపడను