Nara Lokesh : శ్రీవారిని కూడా వదలని వైకాపా
నిప్పులు చెరిగిన నారా లోకేష్
Nara Lokesh : వైసీపీ నేతలు దిగజారు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh). రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ విజయ సాయి రెడ్డి పింక్ డైమండ్ మాయమైందని అన్నారని, తన తనయుడు దేవాన్ష్ పుట్టిన రోజుకు సంబంధించి ఇప్పటి దాకా 3 కోట్ల విరాళాలు ఇచ్చామని అన్నారు. ఈ నిధులు కేవలం అన్నదానం కోసం వాడాలని టీటీడీ పాలకమండలికి సూచించినట్లు తెలిపారు.
Nara Lokesh Comments
చివరకు తమపై తప్పుడు ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు నారా లోకేష్. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామిని సైతం రాజకీయాల్లోకి లాగుతారా అంటూ నిలదీశారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు.
పెద్దిరెడ్డి పాపం పండిందని, త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తమ పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకుని పుంగనూరులో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దమ్ముంటే ప్రత్యక్షంగా ఎదుర్కోవాలని, కానీ దొడ్డి దారిన ఎవరినో తమపై ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తే పుట్ట గతులు ఉండవన్నారు నారా లోకేష్. ఇకనైనా ఎంపీ విజయ సాయి రెడ్డి సోయి ఉండి మాట్లాడాలని సూచించారు.
Also Read : Daggubati Purandeswari : పుంగనూరు ఘటన బాధాకరం