Nara Lokesh : స్టిక్క‌ర్ల‌పై శ్ర‌ద్ధ నీళ్లివ్వ‌డంలో అశ్ర‌ద్ద‌

టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్

Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. యువ గ‌ళం యాత్ర‌లో భాగంగా బుధ‌వారం నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం బ్రాహ్మ‌ణ‌కొట్కూరులో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. గ‌త ప్ర‌భుత్వం అమ‌లు చేసిన ప‌థ‌కాల‌ను కొన‌సాగించ‌డం చేత కావ‌డం లేదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న సాగుతోంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని, రాబోయే కాలంలో తాము ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు నారా లోకేష్(Nara Lokesh).

తాము ఏర్పాటు చేసిన వాటికి జ‌గ‌న్ త‌న స్టిక్క‌ర్ల‌ను వేసుకుంటున్నాడంటూ ఎద్దేవా చేశారు. దీనిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు . టీడీపీ ప్ర‌భుత్వ హయాంలో ఎన్టీఆర్ సుజ‌ల వాట‌ర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. కానీ ఈ ప‌థ‌కానికి నీళ్లు ఇవ్వ‌కుండా వివ‌క్ష చూపాడంటూ జ‌గ‌న్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు నారా లోకేష్. స్టిక్క‌ర్ల‌పై ఉన్న శ్ర‌ద్ధ సీమ ప్ర‌జ‌ల‌కు గుక్కెడు నీళ్లు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించ‌క పోవడం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక ప్ర‌భుత్వ‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.

మూడు రాజ‌ధానుల పేరుతో కాల‌యాప‌న చేయ‌డం త‌ప్ప ఒక్క‌ట‌న్నా ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చిన ప‌ని చేసిన పాపాన పోలేద‌ని మండిప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ నందికొట్కూరుకు చేరుకున్న నారా లోకేష్(Nara Lokesh) యువ గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా 1200 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్నారు. ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతూ వారి స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప‌నిలో ప‌నిగా వైసీపీ స‌ర్కార్ పై సెటైర్లు వేస్తూ ముందుకు సాగుతున్నారు.

Also Read : 10వ త‌ర‌గతి ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల‌

Leave A Reply

Your Email Id will not be published!