Nara Lokesh : జగన్ పాలనలో రైతులు ఆగమాగం
నిప్పులు చెరిగిన టీడీపీ నేత నారా లోకేష్
Nara Lokesh : ఏపీలో సీఎం జగన్ రెడ్డి పాలన జనం పాలిట శాపంగా మారిందని ఆరోపించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన చేపట్టిన యువ గళం పాదయాత్ర ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా యాత్రలో రైతులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ పంటకు గిట్టుబాట ధర రావడం లేదని, భూసార పరీక్షలు చేపట్టడం లేదని, పండించేందుకు కావాల్సిన పెట్టుబడిని ఇవ్వడం లేదంటూ నారా లోకేష్ కు విన్నవించారు అన్నదాతలు.
ప్రస్తుత ప్రభుత్వం సాగు పేరుతో మోసం చేస్తోందని, ఆర్బీకేల పేరుతో రైతులకు చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు నారా లోకేష్. జగన్ రెడ్డి రాష్ట్రంలో రాజారారెడ్డి పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారని, మార్పు ఖాయమన్నారు. సంక్షేమ పథకాల పేరుతో అప్పులు చేయడం తప్ప రాష్ట్రానికి ఏం ఒరగ బెట్టారంటూ ప్రశ్నించారు నారా లోకేష్.
రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుకోవాల్సిన సీఎం అన్నదాతలను ఇక్కట్ల పాలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, తమ వారికి కాంట్రాక్టులు దక్కేలా చేయడం తప్ప ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు నారా లోకేష్(Nara Lokesh).
అంతకు ముందు ఆత్మకూరు నియోజకవర్గం లోని చిలకలమర్రిలో భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో కరపత్రాలు పంపిణీ చేశారు నారా లోకేష్. మహిళలు, యువత, వృద్దులు , రైతులకు ఇచ్చిన ప్రతి హామీని వివరించారు.
Also Read : Bhatti Vikramarka : పేదల భూములు గుంజుకుంటే ఖబడ్దార్