Nara Lokesh : జగన్ పాలన జనం ఆవేదన
టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ – తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన తీవ్రంగా స్పందించారు. ఏపీ సర్కార్ పై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేక పోయినా తన తండ్రిని కావాలని జైలుకు వెళ్లేలా చేశారని ఆరోపించారు.
Nara Lokesh Slams AP Govt
వైసిపీ చీఫ్ , సీఎం తన అవినీతి దందాలకు అడ్డు వస్తున్నాడని సొంత బాబాయ్ ని వేసేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు జగన్ పాలనను చూసి జడుసుకుంటున్నారని పేర్కొన్నారు నారా లోకేష్(Nara Lokesh). కావలిలో రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్ తీయాలంటూ హారన్ ఇచ్చిన ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేయడం దారుణమన్నారు.
ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ప్రతి చోటా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. పట్ట పగలు గూండాల కంటే ఘోరంగా దాడికి దిగడం సిగ్గు పడాల్సిన అంశమన్నారు. సైకో జగన్ పోతేనే ఇవన్నీ మటుమాయం అవుతాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పట్టిన పీడ, శని పోతుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నారా లోకేష్.
రాష్ట్రంలో వైసీపీ పాలన గాడి తప్పిందని, త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. టీడీపీ, జనసేన సంకీర్ణ సర్కార్ పవర్ లోకి వస్తుందన్నారు.
Also Read : Komatireddy Raj Gopal Reddy : నిన్న జంప్ నేడు టికెట్