Nara Lokesh : టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడు పెంచారు. ఆయన మాటల తూటాలు పేల్చారు. లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర కొనసాగుతోంది కృష్ణా జిల్లాలో గన్నవరం సాక్షిగా ఆయన మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు.
Nara Lokesh Slams Kodali Nani
ఇంకా 9 నెలలు ఓపిక పట్టాలని, ఆ తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని ప్రకటించారు. తాము పవర్ లోకి వచ్చాక కొడాలి నాని సంగతి చూస్తానని హెచ్చరించారు. కొడాలి నానిని కట్ డ్రాయర్ తో ఊరేగింపు చేస్తానంటూ సంచలన ఆరోపణలు చేశారు.
విచిత్రం ఏమిటంటే తండ్రి నారా చంద్రబాబు నాయుడు తనను ఎంతగా విమర్శలు చేసినా పట్టించుకునే వారు కాదు. కానీ కొడుకు నారా లోకేష్(Nara Lokesh) మాత్రం తాను ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు.
తాను మంత్రిగా ఉన్న సమయంలో సార్ సార్ అంటూ వచ్చారని కానీ ఇప్పుడు పార్టీ మారాక మరిచి పోయారని ఎద్దేవా చేశారు. కాలం ఒకేరీతిగా ఉండదన్నారు. తన తల్లిని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు నారా లోకేష్.
ఇదిలా ఉండగా మాస్ వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్ పై వైసీపీ శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఏపీ పాలిటిక్స్ మరింత వేడిని రాజేస్తున్నాయి.
Also Read : CM KCR Congrats : బడే నాగ జ్యోతికి కేసీఆర్ కంగ్రాట్స్